కేసీఆర్‌వి అన్నీ కలలే… మాదే అధికారం

0
171

తెలంగాణ గురించి ఆలోచించకుండా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కలలు కంటున్నాడు. కొందరు నిద్రలో కలలు కంటే ఇతను పగటి కలలు కంటున్నాడు. కేసీఆర్ కలలు నెరవేరవు. ఎనిమిదేళ్ళలో నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇన్ని రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకి కేసీఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు తరుణ్‌ చుగ్.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసింది కేసీఆర్. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ లకు బీజేపీ భయపడదు. తెలంగాణ ప్రజలకు భయపడి కేసీఆర్ బిఆర్‌ఎస్ పేరుతో రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్. తెలంగాణను కాపాడాల్సింది పోయి భ్రష్టు పట్టించారు. ముందు ముఖ్యమంత్రిగా నీ బాధ్యతలు నెరవేర్చు. తర్వాత ప్రధాని అవ్వాలని కలలు కను అంటూ చురకలేశారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి తనను ప్రధానిని చేయాలని మమత, దేవేగౌడ, అఖిలేష్, కేజ్రీవాల్, ఇతరులను కలిశాడు. కానీ ఎవరూ మద్దతు తెలపలేదు.

ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ ఇండ్లు, దళిత బంధు ఇవ్వలేదు. కేసీఆర్ నెరవేర్చని హామీలపై మేము చర్చకు సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు తరుణ్ చుగ్. ఓపెన్ డిబేట్ కు మా తరుపున బండి సంజయ్ వస్తాడు.. కేసీఆర్ వస్తాడా? తెలంగాణలో మాకు మంచి పేరు వస్తోంది. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here